Mon Dec 23 2024 04:53:48 GMT+0000 (Coordinated Universal Time)
ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు విద్యార్థులు దుర్మరణం
గువాహటిలోని అస్సాం ఇంజినీరింగ్ కాలేజీలో మూడవ సంవత్సరం చదువుతున్న 10 మంది విద్యార్థులు ఆదివారం అర్థరాత్రి తర్వాత కాలేజీ
అస్సాంలోని గువాహటిలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కారు- వ్యాన్ ఢీ కొన్న ఈ ప్రమాదంలో ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు దుర్మరణం చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు, క్షతగాత్రులంతా ఓ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్నట్లు తెలుస్తోంది. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదం పై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
గువాహటిలోని అస్సాం ఇంజినీరింగ్ కాలేజీలో మూడవ సంవత్సరం చదువుతున్న 10 మంది విద్యార్థులు ఆదివారం అర్థరాత్రి తర్వాత కాలేజీ నుంచి కారులో బయల్దేరారు. సోమవారం తెల్లవారుజామున జలూక్ బరీ ప్రాంతంలో వీరంతా ప్రయాణిస్తున్న కారును నడుపుతున్న వ్యక్తి కారును కంట్రోల్ చేయడంలో నియంత్రణ కోల్పోయాడు. దాంతో కారు డివైడర్ ను దాటి ఎదురుగా వస్తోన్న పికప్ వ్యాన్ ను ఢీ కొట్టింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వ్యాన్ లో ఉన్న ముగ్గురు కూడా గాయపడ్డారు.
ప్రమాదంపై స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను గువాహటి మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. విద్యార్థులు కారును అద్దెకు తీసుకుని వెళ్తుండగా ప్రమాదం జరిగిందని వెల్లడించారు. అతివేగమే ప్రమాదానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story