Mon Dec 23 2024 18:41:10 GMT+0000 (Coordinated Universal Time)
భర్త, అత్తను చంపి.. డెడ్ బాడీలను ఫ్రిడ్జ్ లో కుక్కిన యువతి
అస్సాంలోని నూన్మతి ప్రాంతానికి చెందిన వందన కలిత జిమ్ ట్రైనర్ గా పనిచేస్తుంది. భర్త అమర్ జ్యోతి దేయ్ నిరుద్యోగి.
దేశంలో శ్రద్ధ తరహా ఘటనలు పునరావృతమవుతూనే ఉన్నాయి. నేరాలు చేసేవారు.. తమకు శిక్షపడుతుందన్న భయం కూడా లేకుండా.. మనుషులను దారుణంగా హతమారుస్తున్నారు. శ్రద్ధ ఘటన తర్వాత నిక్కీ యాదవ్ యువతి హత్య అంతటి సంచలనం రేపింది. నిన్న రాజస్థాన్ లోనూ వివాహిత హత్యకేసు కలకలం రేపింది. తాజాగా అస్సాంలో ఓ యువతి తన భర్త, అత్తను చంపి, వారి మృతదేహాలను ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్ లో కుక్కిన ఘటన వెలుగుచూసింది. కొద్దిరోజులకు మృతదేహాల శరీర భాగాలను మేఘాలయలోని సరిహద్దులో ఉన్న చిరపుంజిలో విసిరేసింది.
అస్సాంలోని నూన్మతి ప్రాంతానికి చెందిన వందన కలిత జిమ్ ట్రైనర్ గా పనిచేస్తుంది. భర్త అమర్ జ్యోతి దేయ్ నిరుద్యోగి. వందనకు దంతి దేకా అనే ప్రియుడు ఉన్నాడు. వారిద్దరి సంబంధానికి భర్త, అత్త అడ్డుగా ఉన్నారని భావించి.. ప్రేమికుడి సహాయంతో ఇద్దరినీ హతమార్చింది. అనంతరం శరీరాలను ముక్కలు చేసి మూడ్రోజులు ఫ్రిడ్జ్ లో దాచింది. ఆ తర్వాత చిరపుంజిలో శరీర భాగాలను విసిరేసింది. తన అక్క, మేనల్లుడు కనిపించకపోవడంతో శంకరి దేయ్ తమ్ముడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు తమదైన స్టైల్ లో విచారించగా.. అసలు విషయం చెప్పింది. వారిద్దరి శరీర భాగాలను పడేసిన ప్రాంతాన్ని పోలీసులకు చూపించింది. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కు తరలించారు. నిందితురాలిని అరెస్ట్ చేసి.. పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నారు.
Next Story