Mon Dec 23 2024 14:05:05 GMT+0000 (Coordinated Universal Time)
వివాహ వేడుకలో విషాదం.. బావిలో పడి 13 మంది మృతి
కప్పు కూలిపోవడంతో.. దానిపై నిలబడిన వారంతా బావిలో పడిపోయారు. ఈ ప్రమాద ఘటనలో 13 మంది మహిళలు మృతి చెందినట్లు పోలీసులు
ఓ వివాహ వేడుక 13 మందిని బలితీసుకుంది. వివాహానికి వెళ్లిన 13 మంది మహిళలు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందారు. ఈ తీవ్ర విషాద ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఖుషీనగర్ జిల్లా నెబువా నౌరంజియాలో వివాహ వేడుకలో భాగంగా హల్దీ ఫంక్షన్ జరుగుతోంది. ఆ ఫంక్షన్ కు వెళ్లిన కొంతమంది మహిళలు, యువతులు బావి పై కప్పు పై నిలబడి ఉన్నారు. బరువు ఎక్కువ అవ్వడంతో ఆ బావి పై కప్పు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.
Also Read : సినిమా టికెట్ ధరలపై నేడు కీలక భేటీ
పై కప్పు కూలిపోవడంతో.. దానిపై నిలబడిన వారంతా బావిలో పడిపోయారు. ఈ ప్రమాద ఘటనలో 13 మంది మహిళలు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో 9 మంది బాలికలు ఉన్నారు. బావిలో పడిన మరో 15 మందిని గ్రామస్తులు రక్షించగా.. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ఈ ప్రమాద ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపి.. ఒక్కో కుటుంబానికి రూ.4 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
Next Story