Mon Dec 23 2024 11:31:02 GMT+0000 (Coordinated Universal Time)
బీహార్ పేలుడు ఘటన : పెరుగుతున్న మృతుల సంఖ్య
నిద్రమత్తులో ఉన్న చుట్టుపక్కల ప్రజలు.. భారీ శబ్దానికి ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందోనని తీవ్ర భయాందోళనలు చెందారు. పేలుడు ధాటికి
బీహార్ : శుక్రవారం తెల్లవారుజామున బీహార్ లో జరిగిన పేలుడులో మృతుల సంఖ్య పెరుగుతోంది. పేలుడు సంభవించిన సమయంలో ఐదుగురు మృతి చెందగా.. ఇప్పుడు ఆ సంఖ్య ఏడుకి పెరిగింది. పదుల సంఖ్యలో గాయపడగా.. వారిని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాజ్వాలీచక్ ప్రాంతంలోని యతీంఖానా సమీపంలో ఉన్న మూడంతస్తుల భవనంలో భారీ పేలుడు సంభవించింది. ఆ పేలుడు ధాటికి భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.
Also Read : బీహార్ లో భారీ పేలుడు .. ఐదుగురి మృతి
నిద్రమత్తులో ఉన్న చుట్టుపక్కల ప్రజలు.. భారీ శబ్దానికి ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందోనని తీవ్ర భయాందోళనలు చెందారు. పేలుడు ధాటికి సమీపంలోని నివాసాలకు కూడా పగుళ్లు ఏర్పడ్డాయి. కాగా.. భవనం కుప్పకూలిన సమయంలో అందులో ఎంతమంది ఉన్నారన్న విషయం ఇంకా తెలియరాలేదు. భవనం శిథిలాల కింద పదుల సంఖ్యలో చిక్కుకుని ఉండవచ్చని, మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని తెలుస్తోంది. కాగా.. భవనం యజమాని అక్రమంగా బాణాసంచా యూనిట్ ను నడుపుతున్నాడని, దాని కారణంగానే ఈ పేలుడు సంభవించి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Next Story