Mon Dec 23 2024 01:04:33 GMT+0000 (Coordinated Universal Time)
బూత్ లో కూర్చుని మద్యం సేవించిన మందుబాబులు అరెస్ట్
మందుకొట్టేందుకు ట్రాఫిక్ పోలీస్ బూత్ నే అడ్డాగా మార్చుకుని.. అందులో దర్జాగా కూర్చుని బిర్యానీ తింటూ..
హైటెక్ సిటీ జంక్షన్ సైబర్ టవర్స్ ఎదురుగా ఉన్న ట్రాఫిక్ పోలీస్ బూత్ లో నిన్న ఇద్దరు వ్యక్తులు కూర్చుని.. మద్యం సేవిస్తున్న వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అయింది. ఇది పోలీసుల దృష్టికి చేరడంతో.. వెంటనే ఆ ఇద్దరు మందుబాబులని వెతికి అరెస్ట్ చేశారు. మందుకొట్టేందుకు ట్రాఫిక్ పోలీస్ బూత్ నే అడ్డాగా మార్చుకుని.. అందులో దర్జాగా కూర్చుని బిర్యానీ తింటూ ఎంజాయ్ చేస్తున్న వీడియోలు కొందరు నెట్టింట పోస్ట్ చేయగా.. అవి విపరీతంగా వైరల్ అయ్యాయి.
ఇంత జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని కొందరు నెటిజన్లు ప్రశ్నించగా.. కొందరు మాత్రం వారిద్దరి మధ్య ఇలాంటి సంభాషణలు జరిగి ఉండొచ్చంటూ జోకులు వేస్తూ.. ట్వీట్లు చేశారు. ఆ ఇద్దరు మందుబాబుల్ని సంగం గణేష్, వెంగలదాసు గోపిగా గుర్తించారు. పట్టపగలు.. పైగా ట్రాఫిక్ పోలీస్ బూత్ లో కూర్చుని మద్యం సేవిస్తే ఊరుకుంటారా మరి. తాజాగా ఆ ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేసి, విచారణ చేస్తున్నారు.
Next Story