Mon Dec 23 2024 08:37:16 GMT+0000 (Coordinated Universal Time)
గచ్చిబౌలి గురుకుల పాఠశాలలో దారుణం.. తోటి విద్యార్థి గొంతుకోసిన వైనం
రాత్రిపూట అల్పాహారం సేవిస్తుండగా.. తన ప్లేటులో ఉన్న ఉప్మాపై తోటి విద్యార్థి చేయి పడిందని ఆగ్రహం వ్యక్తం..
గచ్చిబౌలి : గచ్చిబౌలి పరిధిలోని ఓ గురుకుల పాఠశాలలో దారుణ ఘటన జరిగింది. అర్థరాత్రి సమయంలో ఓ విద్యార్థి తన తోటి విద్యార్థిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. రాత్రిపూట అల్పాహారం సేవిస్తుండగా.. తన ప్లేటులో ఉన్న ఉప్మాపై తోటి విద్యార్థి చేయి పడిందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో ఇద్దరు విద్యార్థుల మధ్య వాగ్వాదం జరిగింది. టీచర్ జోక్యంతో అప్పటికి వివాదం సద్దుమణిగింది. కానీ.. ఆ విద్యార్థి కోపంతో రగిలిపోయాడు. అర్థరాత్రి సమయంలో తోటి విద్యార్థిపై కత్తితో దాడి చేసి, గొంతు కోశాడు. తీవ్ర రక్తస్రావంతో కొట్టుమిట్టాడుతున్న బాధిత విద్యార్థిని ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు చికిత్స చేశారు. ప్రస్తుతానికి విద్యార్థి ప్రాణానికి ఎలాంటి అపాయం లేదన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story