Wed Mar 26 2025 14:45:28 GMT+0000 (Coordinated Universal Time)
అమెరికాలో కాల్పులు : తెలంగాణ విద్యార్థికి గాయాలు
అమెరికాలో చికాగోలో దారుణం చోటు చేసుకుంది. చికాగోలో జరిపిన కాల్పుల్లో సాయిచరణ్ అనే విద్యార్థి తీవ్ర గాయాలపాలయ్యాడు

అమెరికాలో చికాగోలో దారుణం చోటు చేసుకుంది. చికాగోలో జరిపిన కాల్పుల్లో సాయిచరణ్ అనే విద్యార్థి తీవ్ర గాయాలపాలయ్యాడు. సాయిచరణ్ హైదరాబాద్ లోని బీహెచ్ఈఎల్ ప్రాంతానికి చెందిన వారు. ఎంఎస్ చేసేందుకు అమెరికాకు వెళ్లి అక్కడ నల్లజాతీయుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డాడు.
పరిస్థితి విషమం....
సాయిచరణ్ స్నేహితులు వెంటనే అతని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. సాయిచరణ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని స్నేహితులు చెబుతున్నారు. కాల్పులకు కారణం, కారకులు ఎవరు అన్న వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story