Mon Dec 23 2024 15:23:19 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ సాఫ్ట్వేర్ ఉద్యోగి దారుణ హత్య
ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. సాఫ్ట్వేర్ ఇంజినీర్ హత్యకు గురయ్యారు
ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. సాఫ్ట్వేర్ ఇంజినీర్ హత్యకు గురయ్యారు. కనిగిరి నియోజకవర్గం వెలిగండ్ల మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన రాధ హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. తిరునాళ్ల కోసం ఆమె స్వగ్రామం కోసం వచ్చారు. అయితే ఇంటి నుంచి బయటకు వెళ్లిన రాధ కనిపించకపోవడతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆర్థిక వివాదాలే...
అయితే అదే ఊరికి చెందిన తన స్నేహితుడికి రాధ 70 లక్షలు అప్పుగా ఇచ్చినట్లు సమాచారం. బెంగళూరులో సాఫ్ట్వేర్ సంస్థను నెలకొల్పేందుకు ఈ మొత్తాన్ని ఆ యువకుడు తీసుకున్నారని బంధువులు చెబుతున్నారు. గత కొద్ది రోజులుగా డబ్బుల కోసం ఇద్దరి మధ్య వివాదం నడుస్తుంది. స్వగ్రామానికి వచ్చిన రాధకు ఒంటరిగా వచ్చి డబ్బులు తీసుకెళ్లాలని చెప్పడంతో వెళ్లిన రాధ ఇక రాలేదు. దీంతో ఆమె సెల్ లొకేషన్ ను గుర్తించి జిల్లెల్లపాడు వద్ద మృతదేహాన్ని గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story