Wed Mar 26 2025 20:47:40 GMT+0000 (Coordinated Universal Time)
థాయ్ లాండ్ లో దారుణం... కాల్పుల్లో 32 మంది మృతి
థాయ్ లాండ్ లో దారుణం చోటు చేసుకుంది. ఒక ఉన్నాది జరిపిన కాల్పుల్లో 32 మంది మరణించారు. వీరిలో 23 మంది చిన్నారులున్నారు.

థాయ్ లాండ్ లో దారుణం చోటు చేసుకుంది. ఒక ఉన్నాది జరిపిన కాల్పుల్లో 32 మంది మరణించారు. వీరిలో 23 మంది చిన్నారులున్నారు. మాజీ పోలీస్ అధికారి ఉన్నాదంతో ఈ దారుణానికి పాల్పడ్డారు. చైల్డ్ కేర్ సెంటర్ లో విచక్షణ రహితంగా కాల్పులు జరపడంతో 32 మంది మరణించారు. ఈ ఘటనలో అతని భార్య పిల్లలు కూడా ఉన్నారు. థాయ్ లాండ్ లోని నోంగ్ బువా లంఫూ పట్టణం నడిబొడ్డున ఉన్న పిల్లల డేర్ కేర్ సెంటర్ లో ఈ ఘటన జరిగింది.
విచక్షణారహితంగా...
మాజీ పోలీసు అధికారి ఒకరు ఇష్టమొచ్చినట్లు కాల్పులు జరిపాడు. కళ్లు తెరిచి మూసే లోపు కాల్పులకు చిన్నారులు బలయిపోయారు. కొందరు అతడిని ఆపేందుకు ప్రయత్నించినా వారిపైన కూడా కాల్పులు జరిపాడు. పోలీసులు అక్కడికి చేరుకునే లోపు తనకు తానే కాల్చుకుని చివరకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో 23 మంది చిన్నారులు, చైల్డ్ కేర్ సెంటర్ లో పనిచేస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులు, ఒక పోలీసు అధికారి మరణించాడు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని తెలిసింది.
Next Story