Mon Dec 23 2024 02:27:10 GMT+0000 (Coordinated Universal Time)
Murder : పల్నాడు జిల్లాలో ఒకే కుటుంబంలో ముగ్గురి దారుణ హత్య
పల్నాడు జిల్లాలో దారుణం జరిగింది. ఒకే కుటుంబంలో ముగ్గురిని హతమార్చారు
పల్నాడు జిల్లాలో దారుణం జరిగింది. ఒకే కుటుంబంలో ముగ్గురిని హతమార్చారు. కత్తులతో దారుణంగా నరికి చంపారు. పిడుగురాళ్ల మండలం కోనంకిగ్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ హత్యలు జరిగినట్లు తెలిసింది. తమ కూతురిని అత్తింటి వారిని వేధిస్తున్నారని అత్తంటి వారిని చంపేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
అత్తింటి వారు వేధిస్తున్నారని...
మృతులు తండ్రి అనంత సాంబశివరావు, తల్లి ఆదిలక్ష్మి, కొడుకు నరేష్ లుగా గుర్తించారు. ముగ్గురిని విచక్షణ రహితంగా కత్తులతో నరికి చంపడంతో అక్కడికక్కడే హతులయ్యారు. హత్య చేసిన అనంతరం కోడలు మాధురితో సహా నిందితులందరూ ముప్పాళ్ల పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story