Fri Dec 27 2024 03:38:24 GMT+0000 (Coordinated Universal Time)
Murder : హత్య చేస్తూ.. వీడియో తీసి.. ఇన్స్టాగ్రామ్ లో పోస్టు చేసి
హైదరాబాద్ ప్రగతి నగర్ లో దారుణం చోటు చేసుకుంది. ప్రత్యర్థిని చంపి ఆ హత్య వీడియోను ఇన్స్టాలో పోస్టు చేయడం కలకలం రేపింది
హైదరాబాద్ ప్రగతి నగర్ లో దారుణం చోటు చేసుకుంది. ప్రత్యర్థిని చంపి ఆ హత్య వీడియోను ఇన్స్టాలో పోస్టు చేయడం కలకలం రేపింది. ఎస్ఆర్ నగర్ లోని దాసారం బస్తీకి చెందిన తేజస్ అలియాస్ సిద్ధూ ఒక హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. అయితే జైలుకు వెళ్లి సిద్ధూ బెయిల్ పై విడుదలయ్యాడు. ప్రగతి నగర్ లో తన తల్లితో కలసి నివాసం ఉంటున్నాడు. అయితే ఆదివారం రాత్రి సిద్ధూ తల్లి ఊరికి వెళ్లడంతో తన మిత్రులతో కలసి ఇంట్లోనే మద్యం సేవించాడు.
ఇరవై మంది వచ్చి...
అయితే ఈరోజు తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో ప్రగతి నగర్ లోని బతుకమ్మ ఘాట్ వద్ద ఉండగా ఇరవై మంది బైకులపై వచ్చి సిద్ధూను హత్యచేశారు. కత్తులతో పొడిచి నరికి చంపారు. ఈ హత్యను వీడియో ద్వారా చిత్రీకరించి ఇన్స్టాగ్రామ్ లో పోస్టు చేశారు. హత్యకు హత్య.. పగకు పగ అంటూ పోస్టు పెట్టడంతో ఈ హత్యను చేసిన వారిలో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరికొందరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story