Thu Dec 19 2024 00:16:49 GMT+0000 (Coordinated Universal Time)
కంటిచూపులేని యువతిపై దారుణం... హత్య
గుంటూరు జిల్లా తాడేపల్లిలో దారుణం జరిగింది. గంజాయి మత్తులో యువతిని హత్య చేశాడో ఒక యువకుడు.
గుంటూరు జిల్లా తాడేపల్లిలో దారుణం జరిగింది. గంజాయి మత్తులో యువతిని హత్య చేశాడో ఒక యువకుడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ దారుణానికి ఒడిగొట్టాడు. పదిహేడేళ్ల రాణి కంటి చూపు లేదు. ఆమె ఒక్కతే తాడేపల్లిలోని తన ఇంట్లో ఉండగా రాజు అనే యువకుడు కత్తితో నరికి చంపాడు. ఇంట్లో ఎవరూలేని సమయంలో రాణిపై అత్యాచారానికి పాల్పడిన రాజు విషయాన్ని తన పెద్దమ్మకు చెప్పడంతో రాజును మందలించారు.
అప్పుడే చర్యలు తీసుకోని ఉంటే...?
అయితే తాను అలా చేయలేదని నమ్మబలికిన రాజు వెంటనే రాణిని అతి దారుణంగా నరికి చంపాడు. గంజాయి సేవించిన మత్తులో రాజు ఈ దారుణానికి తెగబడ్డాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. గతంలోనూ రాజు అనేక అరాచకాలు చేశాడని, పోలీసులు చర్యలు తీసుకోకపో బట్టే ఇలాంటి దాడులకు తెగబడుతున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు రాజును చూసీ చూడనట్లు వదిలేస్తున్నారన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రాజుకోసం పోలీసులు గాలిస్తున్నారు.
Next Story