Thu Jan 09 2025 20:50:12 GMT+0000 (Coordinated Universal Time)
ఏటీఎంలో చోరీ : అలారం మోగడంతో పరారైన దుండుగులు
ఎంతో చాకచక్యంగా ఏటీఎంల దొంగతనాలకు పాల్పడుతున్నారు. అది బెడిసి కొడితే.. కటకటాలు లెక్కపెట్టాల్సిందే. తాజాగా కృష్ణాజిల్లా
కూచిపూడి : ఏ కష్టం లేకుండా.. ఈజీగా డబ్బులు సంపాదించాలని చాలా మంది అడ్డదారులు తొక్కుతుంటారు. ఎక్కువ డబ్బులొస్తాయంటే.. స్మగ్లింగ్ వంటి రిస్క్ తో కూడుకున్న పనులు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. కొంతమందైతే ఏకంగా ఏటీఎంలపైనే కన్నేస్తున్నారు. ఏటీఎంలో డబ్బులు దొంగతనం చేయడం ఒక ఎత్తైతే.. ఏకంగా ఏటీఎంలనే ఎత్తుకెళ్లడం అంతకుమించి.. అన్నట్లుగా ఉంది. ఎంతో చాకచక్యంగా ఏటీఎంల దొంగతనాలకు పాల్పడుతున్నారు. అది బెడిసి కొడితే.. కటకటాలు లెక్కపెట్టాల్సిందే.
Also Read : రైల్ ఇంజన్ లో మంటలు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం
తాజాగా కృష్ణాజిల్లా మొవ్వమండలం కూచిపూడి ఎస్ బీఐ ఏటీఎంలో ఇద్దరు యువకులు ఏటీఎం చోరీకి యత్నించారు. ఏటీఎంలో డబ్బులు తీసేందుకు ప్రయత్నించిన క్రమంలో అక్కడున్న అలారం మోగింది. దెబ్బకు దుండగులు పరారయ్యారు. ఏటీఎంలో నుంచి డబ్బులు తీసేందుకు ప్రయత్నించడంతో అదికాస్తా ధ్వంసమైంది. అందులో నుంచి డబ్బులు రాకపోవడంతో బ్యాంక్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. సిబ్బంది ఫిర్యాదు మేరకు కూచిపూడి పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.
Next Story