Mon Dec 23 2024 12:54:44 GMT+0000 (Coordinated Universal Time)
విహార యాత్రలో విషాదం.. నీటిలో పడిన ఫోన్ తీసుకుంటూ ప్రవాహంలో..
సింగపూర్ కిట్స్ కళాశాలలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న ఆరుగురు విద్యార్థులు సోమవారం సాయంత్రం
విహార యాత్రలో విషాదం చోటుచేసుకుంది. నీటిలో పడిన ఫోన్ ను తీసే క్రమంలో ఓ యువకుడు ప్రవాహ వేగానికి కొట్టుకుపోయిన ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. హుజూరాబాద్ మండలం సింగపూర్ కిట్స్ కళాశాలలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న ఆరుగురు విద్యార్థులు సోమవారం సాయంత్రం ఎస్ఆర్ఎస్పీ కాలువపై ఉన్న మిషన్ భగీరథ పైప్ లైన్ల వద్దకు వెళ్లారు.
అక్కడ ఉండి సెల్ఫీలు తీసుకుంటుండగా.. ఒక యువకుడి ఫోన్ జారి కాలువలో పడిపోయింది. దానికోసం నవనీత్ అనే విద్యార్థి నీటిలోకి దిగాడు. ఫోన్ ను తీసే క్రమంలో నీటి ప్రవాహానికి అతను కొట్టుకుపోయాడు. మిగతా ఐదుగురు విద్యార్థులు ఒడ్డుకు చేరుకుని పోలీసులకు సమాచారం ఇవ్వగా.. పోలీసులు విద్యార్థుల వద్ద వివరాలు సేకరించి, నవనీత్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story