Tue Apr 08 2025 15:04:10 GMT+0000 (Coordinated Universal Time)
రైలు నుంచి దూకి బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య !
ఇంట్లో నుంచి ఆనందంగానే కాలేజీకి బయల్దేరిన వర్షకు ఏం కష్టమొచ్చిందో.. ఏమో గానీ.. వనపర్తి జిల్లాలోని ఆరేపల్లి వద్దకు రైలు

రైలు నుంచి దూకి బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది. కళాశాలకు వెళ్తున్నానని చెప్పిన తమ కూతురు.. తిరిగిరాని లోకాలను వెళ్లిందని తెలిసి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా రోధిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. శ్రీ వర్ష అనే విద్యార్థిని హైదరాబాద్ లోని ఓ కళాశాలలో బీటెక్ సెకండియర్ చదువుతోంది. ఆమె సొంతూరు గద్వాల జిల్లాలోని నల్లగుంట. బుధవారం కాలేజీకి వెళ్లేందుకు గద్వాల నుంచి హైదరాబాద్ కు బయల్దేరింది.
ఇంట్లో నుంచి ఆనందంగానే కాలేజీకి బయల్దేరిన వర్షకు ఏం కష్టమొచ్చిందో.. ఏమో గానీ.. వనపర్తి జిల్లాలోని ఆరేపల్లి వద్దకు రైలు రాగానే రైల్లోంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు విద్యార్థిని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసుకున్నారు. యువతి ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు పలు కోణాల్లో విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్ లోని కూకట్ పల్లికి చెందిన మరో బీటెక్ విద్యార్థి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బత్తిని సోహన్ సిద్ధ ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకని దర్యాప్తు చేస్తున్నారు.
News Summary - B tech Student Sri Varsha Commits Suicide in Arepally
Next Story