Thu Dec 19 2024 13:55:29 GMT+0000 (Coordinated Universal Time)
బెజవాడలో బీటెక్ విద్యార్థి బలవన్మరణం.. అబ్బాయిలను మాత్రమే హైలెట్ చేస్తారంటూ..
అంతకుముందు అతను రాసిన సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె టైంపాస్ ప్రేమకు తాను పిచ్చోడినయ్యానని..
బెజవాడలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య ఘటన కలకలం రేపింది. టైంపాస్ ప్రేమకు పిచ్చోడినయ్యానంటూ.. అతను రాసిన సూసైడ్ నోట్ లో పేర్కొన్న ప్రశ్నలు పలువురి మనసులను కదిలించాయి. ఓ యువతి తనను ప్రేమిస్తున్నట్లు నటిస్తూ మోసం చేయడంతో జీవితంపై విరక్తి చెంది.. రైలు కింద తలపెట్టి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కృష్ణ లంకకు చెందిన అబ్దుల్ సలాం (19) కానూరులోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. అదే కాలేజీలో చదువుతున్న ఓ విద్యార్థినితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.
ఆమె అతడిని ప్రేమిస్తున్నట్లు చెప్పింది కానీ.. అదంతా మోసమని తెలిసి అబ్దుల్ తీవ్ర మనస్తాపం చెందాడు. శనివారం రాత్రి వన్ టౌన్ నైజాం గేటు సెంటరు సమీపంలో రైలు వస్తుండగా.. ట్రాక్ పై తలపెట్టి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతకుముందు అతను రాసిన సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె టైంపాస్ ప్రేమకు తాను పిచ్చోడినయ్యానని ఆ లేఖలో అతడు ఆవేదన వ్యక్తం చేశాడు. తనను ప్రేమిస్తున్నట్టు నటిస్తూనే ఓ లెక్చరర్ తో నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడుతోందని పేర్కొన్నాడు. అబ్బాయిలు మోసం చేస్తే హైలైట్ చేస్తారు కానీ.. మరి అమ్మాయిలు చేస్తున్న మోసాన్ని ఈ సమాజం ఎందుకు ప్రశ్నించదని వాపోయాడు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి.. యువకుడి మృతదేహానికి పోస్టుమార్టమ్ జరిగిన అనంతరం.. కుటుంబ సభ్యులకు అప్పగంచారు.
Next Story