Sat Dec 21 2024 05:18:25 GMT+0000 (Coordinated Universal Time)
దారుణం.. ఆడపిల్ల పుట్టిందని మైక్రోఓవెన్ లో పెట్టి చంపేసిన తల్లి
పసిపిల్లలు చీమ కుడితేనే తట్టుకోలేరు. అలాంటిది ఆ పసిగుడ్డును ఏకంగా మైక్రోఓవెన్ లో పెట్టి చంపేసింది. ఈ దృశ్యాలను వేరే గదిలో
న్యూ ఢిల్లీ : యావత్ దేశం ఉలిక్కిపడే ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. ఓవైపు ఆడపిల్లలు అన్ని రంగాల్లోనూ రాణిస్తుంటే.. మరోవైపు ఆడపిల్ల అని తెలిసి కడుపులోనే చంపేయడం, ఆడపిల్ల పుడితే పసికందు అని కూడా చూడకుండా హతమార్చడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా దేశరాజధాని ఢిల్లీలో ఇలాంటి ఘటనే జరిగింది. చిరాగ్ ఏరియాలో గుల్షాన్ కౌశిక్, డింపుల్ కౌశిక్ అనే దంపతులకు రెండు నెలల కిందట ఆడపిల్ల పుట్టింది. అయితే ఆడపిల్ల పుట్టడం ఇష్టం లేని తల్లి డింపుల్ ఆ చిన్నారి పట్ల దారుణంగా ప్రవర్తించింది. పేగు తెంచుకుని పుట్టిన కన్నబిడ్డ అని కూడా చూడకుండా అతి కిరాతకంగా హత్య చేసింది.
పసిపిల్లలు చీమ కుడితేనే తట్టుకోలేరు. అలాంటిది ఆ పసిగుడ్డును ఏకంగా మైక్రోఓవెన్ లో పెట్టి చంపేసింది. ఈ దృశ్యాలను వేరే గదిలో ఉన్న చిన్నారి నానమ్మ చూడటంతో బిగ్గరగా అరిచింది. దీంతో డింపుల్ వంట గది డోర్ లాక్ చేసింది. అంతలోనే ముసలావిడ అరుపులు విని ఇరుగుపొరుగు వారు వెంటనే వచ్చి వంట గది తలుపులు బద్దలు కొట్టారు. లోపలకు వెళ్లి మైక్రోఓవెన్ తీసి చూడగా పాప చనిపోయి కనిపించింది. వెంటనే వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గుల్షాన్ కౌశిక్, డింపుల్ కౌశిక్ దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Next Story