Mon Dec 23 2024 02:47:08 GMT+0000 (Coordinated Universal Time)
Virat Kohli : ఆ ప్రకటన నిజమేనా.. డీలా పడ్డ విరాట్ ఫ్యాన్స్
విరాట్ కొహ్లి అభిమానులకు బ్యాడ్ న్యూస్. నాలుగు టెస్ట్‌ల వరకూ ఆడే అవకాశం లేదని తెలిసి అభిమానులు నిరాశలో ఉన్నారు
విరాట్ కొహ్లిని చూస్తూ ఉంటే చాలు. మైదానంలో అతడు కనపడితే చాలు ఫ్యాన్స్‌కు పూనకాలే. విరాట్ కు దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా వీరాభిమానులున్నారు. ఫామ్ లో ఉన్నా లేకపోయినా ఫ్యాన్స్ పట్టించుకోరు. విరాట్ బ్యాట్ ను ఝళిపిస్తుంటే చూడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కొహ్లి కుదురుకుంటే చాలు. ఇక ప్రత్యర్థికి అందనంత స్కోరును లక్ష్యంగా ఉంచుతాడు. అందుకే విరాట్ ను త్వరగా పెవిలియన్ కు పంపించేందుకు ప్రతి ప్రత్యర్థి బౌలర్ ప్రయత్నిస్తుంటాడు.
తొలి రెండు మ్యాచ్‌లకు...
అలాంటి విరాట్ కొహ్లి ఇప్పుడు టెస్ట్ మ్యాచ్ లకు దూరంగా ఉంటారని తెలిసి అభిమానులు నిరాశపడుతున్నారు. ఇంగ్లండ్ తో జరుగుతున్న తొలి రెండు మ్యాచ్ లకు విరాట్ దూరంగా ఉన్నారు. హైదరాబాద్, విశాఖలో జరిగే రెండుటెస్ట్ మ్యాచ్ లకు దూరంగా ఉంటారని బీసీసీఐ ప్రకటించడంతో తర్వాత మూడు మ్యాచ్‌లకైనా అందుబాటులో ఉంటారని ఫ్యాన్స్ ఆశపడ్డారు. కానీ మళ్లీ వచ్చిన ప్రకటన ఫ్యాన్స్ ను హతాశులను చేేసింది. ఆయన రానున్న మూడు మ్యాచ్‌లకు కూడా అందుబాటులో ఉండరట.
నాలుగో టెస్ట్‌కు కూడా...
ఈ నెల 15వ తేదీ నుంచి రాజ్‌కోట్ లో మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ ఇంగ్లండ్ గెలవగా, రెండో మ్యాచ్ లో ఇండియా విజయం సాధించింది. అయితే ఈ టెస్ట్ తో పాటు నాలుగో టెస్ట్ కు కూడా విరాట్ దూరంగా ఉంటారని ఒక పత్రిక తెలపడంతో విరాట్ ఫ్యాన్స్ డీలా పడ్డారు. అయితే ఇది అధికారిక ప్రకటన కాకపోయినా విరాట్ వ్యక్తిగత కారణాలతోనూ ఈ టెస్ట్ మ్యాచ్‌లకు దూరంగా ఉన్నారని చెబుతున్నారు. మరి ఐదో టెస్ట్‌కైనా విరాట్ అందుబాటులోకి వస్తారని ఆశిద్దాం. అయితే అధికారిక ప్రకటన వచ్చే వరకూ వెయిట్ చేద్దాం.
Next Story