Sun Dec 22 2024 06:26:33 GMT+0000 (Coordinated Universal Time)
Bangladesh Fire Accident: 43 మంది సజీవదహనం.. ప్రమాదానికి కారణం ఏమిటంటే?
ఆరు అంతస్తుల షాపింగ్ మాల్లో రాత్రిపూట జరిగిన అగ్నిప్రమాదంలో 43 మంది
Bangladesh Fire Accident:బంగ్లాదేశ్ రాజధాని డాకలోని ఆరు అంతస్తుల షాపింగ్ మాల్లో రాత్రిపూట జరిగిన అగ్నిప్రమాదంలో 43 మంది మరణించారు. ఇంకా చాలా మంది గాయపడ్డారని ఆ దేశ ఆరోగ్య మంత్రి తెలిపారు. వేగంగా పై అంతస్తుల వరకు మంటలు వ్యాపించడంతో ప్రమాద తీవ్రత పెరిగినట్లు తెలుస్తోంది. ఈ మంటల్లో చిక్కుకుని మరో 40 మంది వరకు గాయాలపాలయ్యారు. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు వెంటనే అక్కడికి వెళ్లారు. సహాయక చర్యల్లో పాల్గొన్నారు. దాదాపు 75 మందిని సురక్షితంగా కాపాడారు. రెస్టారెంట్లోని గ్యాస్ సిలిండర్ పేలడం వల్లే ఈ అగ్నిప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది.
బెయిలీ రోడ్డులో ఓ బిర్యానీ రెస్టారెంట్లో గురువారం రాత్రి అగ్నిప్రమాదం జరిగిందని అగ్నిమాపక అధికారులు చెప్పారు. మంటలు కింద ఫ్లోర్ నుంచి పై బిల్డింగ్కు వేగంగా వ్యాపించాయి. అందులో ఉన్న వారు బయటకు రావడానికి వీలులేకుండా పోయింది. ఈ సంఘటన జరిగిన ప్రాంతంలో రెస్టారెంట్లు, వస్త్ర దుకాణాలు, మొబైల్ ఫోన్ల షాపులు ఉన్నాయి. దురదృష్టవశాత్తు రెస్టారెంట్లో ఉన్న 43 మంది చనిపోయినట్లు తెలిపారు. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Next Story