Mon Dec 23 2024 06:07:00 GMT+0000 (Coordinated Universal Time)
యువతిపై బైక్ ట్యాక్సీ డ్రైవర్ అత్యాచారం
తర్వాత మరో వ్యక్తికి ఫోన్ చేసి ఇంటికి పిలిచాడు. అతడు కూడా ఆమెపై అత్యాచారం చేశాడు. మరుసటి రోజు తేరుకున్న ..
మద్యంమత్తులో ఉన్న ఓ యువతిపై బైక్ ట్యాక్సీ డ్రైవర్, అతని స్నేహితుడు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. శుక్రవారం అర్థరాత్రి బెంగళూరు నగరంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేరళకు చెందిన కేరళకు చెందిన 22 ఏళ్ల యువతి శుక్రవారం అర్ధరాత్రి ర్యాపిడో బైక్ ట్యాక్సీ బుక్ చేసుకుంది. ఒక స్నేహితురాలి ఇంటి నుండి మరో ప్రాంతానికి వెళ్లాల్సి ఉంది. ఆమె ఉన్న చోటుకు చేరుకున్న బైక్ ట్యాక్సీ డ్రైవర్, ఆ యువతిని బైక్ పై ఎక్కించుకుని ఆమె చేరాల్సిన ప్రదేశానికి తీసుకెళ్లాడు.
అప్పటికే యువతి మద్యం సేవించి ఉంది. ఆమె బైక్ దిగలేకపోయింది. అదే అదనుగా భావించిన ఆ బైక్ ట్యాక్సీ డ్రైవర్.. ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ యువతిని ఇంటికి తీసుకెళ్లి మత్తులో ఉన్న ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత మరో వ్యక్తికి ఫోన్ చేసి ఇంటికి పిలిచాడు. అతడు కూడా ఆమెపై అత్యాచారం చేశాడు. మరుసటి రోజు తేరుకున్న మహిళ అతడి ఇంటి నుంచి బయటకు వచ్చింది. కానీ తనకు ఎందుకో బాగా అలసటగా అనిపించింది. అనుమానంతో స్థానిక ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోగా.. అత్యాచారం జరిగినట్లు తేలింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అత్యాచారానికి పాల్పడ్డ ఇద్దరు నిందితులతోపాటు, వారికి సహకరించిన మరో యువతిని కూడా అరెస్టు చేశారు.
Next Story