Mon Dec 23 2024 06:42:45 GMT+0000 (Coordinated Universal Time)
బాపట్లలో బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ ఆత్మహత్య
ఐదేళ్లుగా ఆమె నగరం, అక్కడి నుంచి మట్లపూడి ఇండియన్ బ్యాంక్ శాఖల్లో పనిచేస్తూ బ్యాంకు నుంచి రూ.40లక్షల రుణం తీసుకున్నారు
బాపట్లలో బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ బలవన్మరణానికి పాల్పడ్డారు. తెలంగాణలోని సిరిసిల్లకు చెందిన బొల్లి దివ్యవాణి (31) మట్లాపూడిలోని ఇండియన్ బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తోంది. ఐదేళ్లుగా ఇదే ప్రాంతంలో పలు బ్రాంచీల్లో పనిచేసిన దివ్యవాణి ఆర్ధిక ఇబ్బందులతో బలవన్మరణానికి పాల్పడ్డారు.
ఐదేళ్లుగా ఆమె నగరం, అక్కడి నుంచి మట్లపూడి ఇండియన్ బ్యాంక్ శాఖల్లో పనిచేస్తూ బ్యాంకు నుంచి రూ.40లక్షల రుణం తీసుకున్నారు. ఆ రుణంతో గుళ్లపల్లిలో మూడంతస్తుల భవనం నిర్మించుకుని ఉప్పాల శ్రీనివాసరావుకు అద్దెకు ఇచ్చారు. అందులోనే ఒక గదిలో ఆమె నివసిస్తూ ఉన్నారు. బ్యాంకులో పని ఒత్తిడి కారణంగా ఇబ్బందిగా ఉంటోందని ఇటీవల ఇంటికి వెళ్లినప్పుడు తల్లిదండ్రులకు కూడా చెప్పింది. ఆమెను వారు సముదాయించి పంపారు. దీనికి తోడు ఆర్థిక సమస్యలు మరింత ఇబ్బందికి గురిచేశాయి. శనివారం విధులు ముగించుకుని బ్యాంకు నుంచి వచ్చి తన గదిలో నిద్రించింది. ఆదివారం ఉదయం అద్దెకు ఉంటున్న శ్రీనివాసరావు చూసే సమయానికి ఓ గదిలో సీలింగ్కు చున్నీతో ఉరివేసుకొని కనిపించింది. వెంటనే విషయాన్ని పోలీసులకు తెలిపారు. వారు ఘటనాస్థలికి చేరుకుని మృతురాలి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారు సాయంత్రానికి గుళ్లపల్లి చేరుకున్నారు. తమ కుమార్తె పని ఒత్తిడి, ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. తల్లి విమల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతురాలికి తండ్రి లక్ష్మీనారాయణ, అన్న రామకృష్ణ ఉన్నారు. కుమార్తె మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవ్వడం అక్కడున్న ప్రతి ఒక్కరికీ కంటతడి పెట్టించింది.
Next Story