Mon Dec 23 2024 17:44:54 GMT+0000 (Coordinated Universal Time)
మరో మెడికో ఆత్మహత్య
పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. నిన్న సాయంత్రం కాలుతున్న వాసన వస్తుండడంతో నిర్వాహకులు
వరంగల్ మెడికో ప్రీతి ఆత్మహత్య ఘటన ఇంకా పూర్తిగా మరువక ముందే.. మరో మెడికో ఖమ్మంలో ఆత్మహత్య చేసుకుంది. ఖమ్మంలోని మమత మెడికల్ కాలేజీలో బీడీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న సముద్రాల మానస(22) ప్రైవేట్ హాస్టల్ గదిలో బలవన్మరణానికి పాల్పడింది. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. నిన్న సాయంత్రం కాలుతున్న వాసన వస్తుండడంతో నిర్వాహకులు, తోటి విద్యార్థులు వచ్చి చూడగా ఆమె గదిలో పొగలు కనిపించాయి. వెంటనే అప్రమత్తమై తలుపులు బద్దలుగొట్టి లోనికి వెళ్లారు. అప్పటికే మానస మంటల్లో కాలిపోతూ కనిపించింది. వెంటనే మంటలు ఆర్పి కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి వెళ్లి.. మానస మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మానస స్వస్థలం వరంగల్ గా గుర్తించి, ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మానస కాలేజీకి చెందిన హాస్టల్ లో కాకుండా.. కాలేజీకి ఎదురుగా ప్రైవేట్ హాస్టల్ లో ఉంటూ చదువుకుంటుంది. కాగా.. మానస ఓ పెట్రోలు బంకు నుంచి మానస పెట్రోలు కొనుక్కుని వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఇటీవలే మానస తండ్రి మరణించగా.. ఆయన్నే తలచుకుంటూ తరచూ బాధపడేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మానస గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Next Story