Thu Dec 19 2024 15:01:00 GMT+0000 (Coordinated Universal Time)
అమానుషం .. తల్లిని చంపి సూట్ కేస్ లో కుక్కింది
వృత్తి రీత్యా ఫిజియోథెరపిస్ట్. సెనాలి తన భర్త, అత్త, తల్లితో కలిసి ఒకే ఇంట్లో ఉంటోంది. సోమవారం తనతల్లితో..
తల్లిని చంపి.. ఆమె మృతదేహాన్ని సూట్ కేస్ లో కుక్కిందో కూతురు. అంతేకాక ఆ సూట్ కేస్ తీసుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. సూట్ కేస్ లో ఉన్న మృతదేహాన్ని చూసి షాకవ్వడం పోలీసుల వంతైంది. ఈ అమానుష ఘటన బెంగళూరులోని మికో లే అవుట్ పరిధిలో సోమవారం (జూన్ 11) చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమబెంగాల్ కు చెందిన 39 ఏళ్ల సెనాలి సేన్ కొన్నేళ్లుగా బెంగళూరులోని ఓ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటోంది.
వృత్తి రీత్యా ఫిజియోథెరపిస్ట్. సెనాలి తన భర్త, అత్త, తల్లితో కలిసి ఒకే ఇంట్లో ఉంటోంది. సోమవారం తనతల్లితో గొడవపడిన సెనాలి ఆమెకు నిద్రమాత్రలిచ్చి చంపేసింది. ఆపై ఆమె మృతదేహాన్ని ఒక ట్రాలీ సూట్ కేస్ లో కుక్కి నేరుగా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి.. లొంగిపోయింది. తల్లిని తానే హత్య చేసినట్లు తెలిపింది. ప్రతిరోజూ గొడవపడుతుండటంతోనే ఈ పనిచేసినట్లు చెప్పడంతో.. పోలీసులు షాకయ్యారు. అనంతరం సెనాలిని అరెస్ట్ చేసి విచారించారు. ఇదంతా జరిగినపుడు సెనాలి భర్త ఇంట్లో లేడని తెలిపింది. అత్త ఇంట్లోనే ఉన్న ఆమెకు ఇదంతా తెలియకపోవడం గమనార్హం.
Next Story