Mon Dec 23 2024 09:38:11 GMT+0000 (Coordinated Universal Time)
పెళ్ళై విడాకులు తీసుకున్న యువతి.. వెంటనే పెళ్లి చేసుకోవాలని కోరుతూ.!
సదరు మహిళ వద్దంటున్నా.. తనను వెంటనే పెళ్లి చేసుకోవాలని మహిళను వేధిస్తున్నాడు
శుక్రవారం నాడు బెంగళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన వివాహ ప్రతిపాదనను తిరస్కరించినందుకు ఓ వ్యక్తి తన ప్రియురాలిపై యాసిడ్ పోశాడు. సదరు మహిళ మహిళ అప్పటికే విడాకులు తీసుకుంది. ఇప్పుడు మరో వ్యక్తి తనను వివాహం చేసుకోవాలని కోరగా ఆ ప్రతిపాదనను ఆమె తిరస్కరించింది. నిందితుడి కోసం కుమారస్వామి లేఅవుట్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. గత రెండు నెలల్లో కర్ణాటక రాజధానిలో ఇది మూడో యాసిడ్ దాడి ఘటన. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు, యువతి గతంలో ప్రేమించుకున్నారు. అయితే ఆ మహిళ మరొకరిని పెళ్లి చేసుకుంది. ఆమె విడాకుల తర్వాత, నిందితుడు ఆమెతో సన్నిహితంగా ఉన్నాడు. వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే, కొంత సమయం వేచి ఉండాలని మహిళ కోరింది.
గౌరిపాళ్యకు చెందిన అహ్మద్ ని నిందితుడిగా గుర్తించారు. సదరు మహిళ వద్దంటున్నా.. తనను వెంటనే పెళ్లి చేసుకోవాలని మహిళను వేధిస్తున్నాడు. ఈ విషయమై ఇద్దరూ చాలాసార్లు గొడవ పడ్డారని పోలీసులు తెలిపారు. శుక్రవారం మహిళ కుమారస్వామి లేఅవుట్ నుంచి జేపీ నగర్ ప్రాంతానికి వెళ్తుండగా, అహ్మద్ యాసిడ్ బాటిల్తో ఆమెను వెంబడించాడు. బెంగుళూరులోని సారక్కి జంక్షన్ సమీపంలో ఆమె ముఖంపై యాసిడ్ పోశాడు. అనంతరం అతడు అక్కడి నుంచి పారిపోయాడని పోలీసులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మహిళను ఆస్పత్రికి తరలించారు. IANS నివేదిక ప్రకారం, బాధితురాలి ముఖంపై గాయాలు అయ్యాయి. ఆమె కుడి కన్ను దెబ్బతింది. ఈ ఘటనకు సంబంధించి తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. గత రెండు నెలల్లో బెంగళూరు నగరంలో యాసిడ్ అటాక్ కు సంబంధించి ఇది మూడో సంఘటన.
Next Story