Mon Dec 23 2024 15:25:07 GMT+0000 (Coordinated Universal Time)
డిగ్రీ విద్యార్థినిని దారుణంగా హతమార్చిన దుండగులు
షాన్ బోగన్హల్లి ప్రాంతానికి చెందిన రాశి (20) అనే యువతి స్థానికంగా ఉన్న యెలహంక కాలేజీలో డిగ్రీ (బీఏ)..
డిగ్రీ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. కళాశాల నుండి ఇంటికి వెళ్తున్న యువతిని.. ఇద్దరు దుండగులు కాపు కాసి మరీ గొంతుకోసి హత్య చేశారు. బెంగళూరులో మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. షాన్ బోగన్హల్లి ప్రాంతానికి చెందిన రాశి (20) అనే యువతి స్థానికంగా ఉన్న యెలహంక కాలేజీలో డిగ్రీ (బీఏ) మొదటి సంవత్సరం చదువుతోంది. ఎప్పటిలాగానే మంగళవారం కూడా కాలేజీకి వెళ్లి.. సాయంత్రం తిరిగి ఇంటికి వెళ్తుండగా.. అప్పటికే ఆమెకోసం దారి కాచిన ఇద్దరు దుండగు బైక్ పై వచ్చి దాడి చేశారు.
యువతిని ఫాలో చేస్తూ.. అదను చూసి.. గొంతు కోసి పరారయ్యారు. రాశి రక్తపుమడుగులో పడి.. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండగా.. స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. కానీ.. అప్పటికే రాశి మరణించిందని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్నతల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం వెతుకుతున్నట్లు వెల్లడించారు. కాగా.. బెంగళూరులో ఇలా యువతి హత్య జరగడం ఇది రెండో సారి. ఈ నెల 2న కూడా పవన్ కల్యాణ్ అనే యువకుడు తనను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిందన్న కోపంతో లయస్మిత అనే యువతిని కాలేజీ ఆవరణలోనే కత్తితో పొడిచి హతమార్చాడు. ఒకే నెలలో ఇద్దరు విద్యార్థినులు హత్యకు గురికావడం సంచలనం రేపుతోంది.
Next Story