Sun Dec 22 2024 21:45:18 GMT+0000 (Coordinated Universal Time)
భైరి నరేష్ అరెస్ట్
అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భైరి నరేష్ ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిసింది
అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భైరి నరేష్ ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిసింది. ఆయనను వరంగల్ లో అరెస్ట్ చేసినట్లు చెబుతున్నారు. ఇటీవల నిజామాబాద్ లో జరిగిన నాస్తిక సభలో భైరి నరేష్ అయ్యప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిని నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి.
పరారీలోనే ఉండి...
భైరి నరేష్ ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ లు ఊపందుకున్నాయి. కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మతపరమైన విధ్వేషాలను రెచ్చగొట్టే వారిని ఉపేక్షించేది లేదని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నా పరారీలో ఉండి సోషల్ మీడియాలో వీడియోలు పోస్టు చేస్తున్న నరేష్ పై పోలీసులు సీరియస్ అయ్యారు. వరంగల్ ప్రాంతంలో ఆయనను అరెస్ట్ చేసినట్లు తెలిసింది. కొడంగల్ పోలీస్ స్టేషన్ లో భైరి నరేష్ పై కేసు నమోదు చేశారు.
Next Story