Fri Dec 20 2024 01:41:56 GMT+0000 (Coordinated Universal Time)
మనోజ్ పై కత్తితో దాడి చేసిన శిల్ప
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కత్తి దాడి ఘటన
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కత్తి దాడి ఘటన స్థానికంగా కలకలం రేపింది. అగ్రికల్చర్ ఆఫీసులో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగుల మధ్య ఘర్షణ కారణంగా ఈ దాడి జరిగిందని చెబుతున్నారు. మనోజ్ అనే ఉద్యోగిపై మరో మహిళా ఉద్యోగి కత్తితో దాడి చేసింది. ఈ ఘర్షణలో గాయపడిన మనోజ్ను తోటి ఉద్యోగులు జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆత్మ రక్షణ కోసమే దాడి చేయాల్సి వచ్చిందని సదరు మహిళా ఉద్యోగి తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రెండు నెలల నుంచి మనోజ్ లీవ్ లో ఉన్నాడని తెలుస్తోంది. జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయానికి వచ్చిన మనోజ్ తో గొడవ జరిగింది. ఇంతలో మనోజ్ ఆమెపై కత్తితో దాడి చేయబోయాడు. అడ్డుకున్న మహిళ అదే కత్తి తో మనోజ్ పైన దాడి చేసింది. దాడి చేసిన శిల్ప ఆత్మకూరు మండల వ్యవసాయ శాఖ అధికారిగా పని చేస్తోంది. మనోజ్ యాదగిరిగుట్ట మండలంలోని మాసాయిపేట ఏఈఓగా పని చేస్తున్నాడు. శిల్ప కు సుధీర్ అనే వ్యక్తి 2012లో వివాహం జరిగింది. ఒక బాబు ఉన్నాడు. రెండు సంవత్సరాల నుంచి భర్త కు దూరంగా ఉంటోంది శిల్ప.
Next Story