Mon Dec 23 2024 07:17:46 GMT+0000 (Coordinated Universal Time)
Big Breaking: ప్రవళిక కేసులో భారీ ట్విస్ట్
బయటపడ్డ చాటింగ్.. ప్రియుడు మోసం చేశాడనే ప్రవళిక ఆత్మహత్య
వరంగల్ జిల్లా బిక్కాజీ పల్లికి చెందిన ప్రవళిక ఆత్మహత్య వ్యవహారంపై తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చోటు చేసుకున్నాయి. అయితే ఆమె ఆత్మహత్యకు కారణం ప్రియుడు మోసం చేయడమేనని పోలీసులు తెలిపారు. ప్రవళిక ప్రియుడు మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటూ ఆమెను మోసం చేయడంతో ఆత్మహత్యకు పాల్పడిందని ఏసీపీ యాదగిరి వెల్లడించారు.
కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని వరంగల్కు తరలించామన్నారు. టీఎస్పీఎస్సీ పరీక్ష వాయిదా, రద్దు కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రచారం చేస్తున్నారని, అయితే ప్రియుడు మోసం చేయడం వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు స్పష్టమవుతోందని ఏసీపీ తెలిపారు. గ్రూప్స్ కోచింగ్ కోసం.. అశోక్ నగర్ లోని బృందావన్ గల్స్ హాస్టల్ లో ప్రవళిక 15 రోజుల క్రితం జాయిన్ అయ్యింది. ఆమె హాస్టల్ లో శ్రుతి, సంధ్య అనే స్నేహితులు ఉన్నారని.. వారిని కూడా విచారించామని పోలీసులు తెలిపారు.
ప్రవళిక మొబైల్ చూస్తే.. అందులో ఒక చాటింగ్ ను గమనించామని పోలీసులు తెలిపారు. కోస్గికి చెందిన శివ రామ్ రాథోడ్ అనే అబ్బాయి తో చాటింగ్ చేసిందని గుర్తించాం. నిన్న ఉదయం బాలాజీ దర్శన్ హోటల్ లో వీరిద్దరూ టిఫిన్ చేశారని.. ఆ సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించామన్నారు. శివ రామ్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడని ప్రవళికకు తెలిసింది. ప్రియుడు తనను మోసం చేశాడని.. ప్రవళిక మనస్తాపం తో ఆత్మహత్య చేసుకుందని నిర్దారించామని పోలీసులు తెలిపారు. ఈ విషయం వారి తల్లిదండ్రులకు కూడా తెలుసని.. గతంలో వారు మందలించారన్నారు. ప్రవళిక సూసైడ్ లెటర్, చాటింగ్ ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించామని తెలిపారు. ఆ నివేదిక అనంతరం ప్రియుడు శివరాం పై కేసు నమోదు చేస్తామన్నారు.
Next Story