Mon Dec 23 2024 17:53:11 GMT+0000 (Coordinated Universal Time)
తండ్రి అనే బంధానికే కళంకం తెచ్చిన ఘటన.. కూతుర్ని బెదిరించి..
సభ్య సమాజం చీదరించుకునే పని చేసి.. బంధాలను ప్రశ్నార్థకం చేశాడు. 50 ఏళ్ల వయసున్న ఆ తండ్రి..
బీహార్ : పది మందికీ విద్యాబుద్ధులు నేర్పి.. విద్యార్థులకు సరైన బాట చూపించాల్సిన వృత్తి(ప్రధానోపాధ్యాయుడు) లో ఉన్న ఆ తండ్రి.. తండ్రి-కూతురు అనే బంధానికే కళంకం తెచ్చాడు. సభ్య సమాజం చీదరించుకునే పని చేసి.. బంధాలను ప్రశ్నార్థకం చేశాడు. 50 ఏళ్ల వయసున్న ఆ తండ్రి.. కన్న కూతురిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఒక్కసారి కాదు.. రెండుసార్లు కాదు.. ఎన్నో పర్యాయాలు బెదదించి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలోని సమస్థిపూర్ జిల్లా రొసెరా గ్రామంలో వెలుగుచూసింది. తండ్రి చేస్తున్న దారుణాన్ని భరించలేక రహస్యంగా వీడియో తీసి.. అతడి ఆగడాలను బయటపెట్టింది.
వేరేదారి లేక తానుతీసిన రహస్య వీడియోను సోషల్ మీడియాలో పంచుకుని.. తనకు న్యాయం చేయాలని కోరింది. వీడియో చూసిన రొసెరా పోలీసులు బాలికను సంప్రదించారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్ చేసి, విచారణ చేస్తున్నట్లు రొసెరా డిఎస్పి సహియార్ అక్తర్ వెల్లడించారు. ఈ కేసులో ఇంకా నిందితులెవరైనా ఉన్నారా ? అనే సమాచారాన్ని రాబట్టే పనిలో ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. కన్నతల్లి ముందే బాలికపై దారుణం జరుగుతున్నా.. ఆమెనూ బెదిరించడంతో మౌనంగా ఉండిపోయిందని పోలీసులు తెలిపారు.
Next Story