Mon Dec 23 2024 08:52:26 GMT+0000 (Coordinated Universal Time)
భర్త హత్యను ఆత్మహత్యగా సృష్టించడానికి ఎన్నో ప్లాన్స్
ప్రతీకారం తీర్చుకుంటానని అనిల్ తన తండ్రిని బెదిరించాడని
బీహార్‌లోని కైమూర్ జిల్లాలోని భబువా పోలీసులు ఓ వ్యక్తి హత్యకు సంబంధించిన వివరాలను సేకరించింది. తన ప్రేమికుడితో కలిసి భర్తను హత్య చేసిందో మహిళ. అతని మరణాన్ని ఆత్మహత్యగా మార్చేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. బాధితుడి భార్య, ఆమె ప్రియుడు కలిసి మృతదేహానికి ఉరివేశారు. ఈ ఘటన బీహార్‌లోని భబువా పోలీస్ స్టేషన్ పరిధిలోని మోక్రి గ్రామంలో చోటు చేసుకుంది.
మహిళ, ఆమె ప్రియుడు కలిసి భర్తని హత్య చేసి, మృతదేహాన్ని ఆత్మహత్యగా చూపించడానికి ఉరి వేశారు. మృతుడిని ధర్మేంద్రగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మృతుని కుమారుడు మాట్లాడుతూ.. ''మా అమ్మ ప్రేమాదేవి గత పది రోజులుగా అనిల్రామ్తో మాట్లాడుతుండగా, మా నాన్నకు వారి అక్రమ సంబంధం గురించి తెలిసిందని" చెప్పుకొచ్చాడు. అతడితో మాట్లాడవద్దని చెప్పినా వినలేదని కుమారుడు తెలిపాడు. ఈ విషయంపై మా నాన్న పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు మా అమ్మ, అనిల్‌ని కూడా పిలిచి వారికి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించారు, కానీ వారు పోలీసుల మాట వినలేదు. పోలీసుల మాటలు పట్టించుకోకుండా మా అమ్మ, అనిల్ కలిసి జీవించడం మొదలుపెట్టారని కుమారుడు తెలిపాడు.
ప్రతీకారం తీర్చుకుంటానని అనిల్ తన తండ్రిని బెదిరించాడని ధర్మేంద్ర కుమారుడు తెలిపారు. ఆ తర్వాత అనిల్, ప్రేమ కలిసి అర్థరాత్రి ఇంట్లోకి ప్రవేశించి బాధితుడిని గొంతు నులిమి హత్య చేసి శవానికి ఉరివేసారు. సంఘటన జరిగిన ఒక రోజు తర్వాత ధర్మేంద్ర చనిపోయిన విషయాన్ని తెలియజేశారు. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భబువా సదర్ ఆస్పత్రికి తరలించారు. భబువా పోలీస్‌స్టేషన్ పరిధిలోని మోక్రి గ్రామంలో ఓ వ్యక్తి హత్యకు గురైనట్లు మాకు సమాచారం అందిందని భబువా ఏఎస్ఐ గౌర్వ్కుమార్ తెలిపారు. బాధితుడి భార్య అనిల్‌తో అక్రమ సంబంధం పెట్టుకుందని, దీంతో హత్యకు దారితీసిందని కుటుంబీకులు తెలిపారన్నారు. దర్యాప్తు చేపట్టామని పోలీసులు వెల్లడించారు.
News Summary - wife her lover strangulate husband to death in Kaimur
Next Story