Mon Dec 23 2024 14:57:49 GMT+0000 (Coordinated Universal Time)
బైక్ మెకానిక్ దారుణ హత్య.. ఇల్లంతా రక్తంతో..
హరి ఒంటరిగా ఉన్న సమయంలో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు సమాచారం. హత్య జరిగిన తీరు చూస్తుంటే..
కొనకనమిట్ల : ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలంలో దారుణ ఘటన జరిగింది. గొట్లగట్టు గ్రామానికి చెందిన బైక్ మెకానిక్ రక్తపు మడుగులో.. అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హరి అనే బైక్ మెకానిక్ ను గుర్తు తెలియని వ్యక్తులు హత్యచేసినట్లు తెలుస్తోంది.
హరి ఒంటరిగా ఉన్న సమయంలో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు సమాచారం. హత్య జరిగిన తీరు చూస్తుంటే.. హత్య చేయడానికి వచ్చిన వ్యక్తులకు - హరికి మధ్య తీవ్ర పెనుగులాట జరిగిన అనంతరం హరిని హతమార్చినట్లుగా తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు విషయమై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story