Mon Dec 23 2024 06:55:39 GMT+0000 (Coordinated Universal Time)
మద్యంలోకి మంచింగ్ గా యువతి మృతదేహంలోని మాంసం..
లడసాహి పోలీస్ స్టేషన్ పరిధిలోని బన్సాహి గ్రామానికి చెందిన మధుస్మిత సింగ్ అనే యువతి అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ..
మందుబాబులు మద్యం మత్తులో ఎన్నో దారుణాలకు పాల్పడుతుంటారు. మహిళలపై అఘాయిత్యాలు, గొడవలు, హత్యలు.. మద్యంమత్తులో ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలూ ఉన్నాయి. కానీ.. ఒడిశాలో జరిగిన ఈ అమానవీయ ఘటన గురించి తెలిస్తే.. ఒళ్లు జలదరిస్తుంది. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులు.. శ్మశానంలో కాలుతున్న ఓ యువతి మృతదేహంలోని మాంసాన్ని తిన్నారు. ఇది గమనించిన గ్రామస్తులు వారిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నిందితులపై కేసు నమోదు చేసి, వారిని కటకటాల్లోకి పంపారు.
లడసాహి పోలీస్ స్టేషన్ పరిధిలోని బన్సాహి గ్రామానికి చెందిన మధుస్మిత సింగ్ అనే యువతి అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమె కుటుంబ సభ్యులు యువతి మృతదేహానికి దహన సంస్కారాలు చేసి ఇళ్లకు వెళ్లిపోయారు. దంత్ని గ్రామానికి చెందిన మోహన్ సింగ్, నరేంద్ర సింగ్ అనే ఇద్దరు వ్యక్తులు ఫుల్లుగా మద్యం సేవించి.. స్మశాన వాటికలో కాలుతున్న యువతి మృతదేహంలోని మాంసాన్ని తిన్నారు. ఇది గమనించిన గ్రామస్తులు ఆ యువతి కుటుంబ సభ్యులకు చెప్పగా.. అందరూ అక్కడికి చేరుకుని ఆ ఇద్దరినీ చితకబాది పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి వారిపై కేసు నమోదు చేశారు. కాగా.. మోహన్, నరేంద్రలు చుట్టుపక్కల గ్రామాల్లో కూలిపనులు చేస్తుంటారని తెలిపారు.
Next Story