Mon Dec 23 2024 07:00:21 GMT+0000 (Coordinated Universal Time)
బీజేపీ నేత హత్య.. లొంగిపోయిన నిందితుడు
11 గంటల సమయంలో గుర్తుతెలియని కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు రామేశ్వర్ కు అతిసమీపంగా వచ్చి కాల్చిచంపారు.
ఈశాన్యరాష్ట్రమైన మణిపూర్ లో బీజేపీ నేత దారుణ హత్యకు గురయ్యారు. తౌబల్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బీజేపీ రాష్ట్ర ఎక్స్ సర్వీస్‌మెన్ సెల్‌కు లైష్రామ్ రామేశ్వర్ సింగ్ కన్వీనర్‌గా ఉన్నారు. ఆయన క్షేత్రి లీకై ప్రాంతంలోని ఆయన ఇంటి గేటు సమీపంలో హత్యకు గురయ్యారు. నిన్న ఉదయం (జనవరి 24) 11 గంటల సమయంలో గుర్తుతెలియని కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు రామేశ్వర్ కు అతిసమీపంగా వచ్చి కాల్చిచంపారు. తూటాలు సింగ్ చాతీలోకి దూసుకెళ్లడంతో.. ఆయన తీవ్రంగా గాయపడ్డారు.
వెంటనే ఆయన్ను సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. కొద్ది గంటలకే నిందితుల్లో ఒకడైన నావోరెమ్ రికీ పాంటింగ్ సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని బిష్ణుపూర్ జిల్లాలోని కీనౌకు చెందిన రికీ ని ఇంఫాల్ వెస్ట్ జిల్లాలోని హావోబమ్ మరక్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. హవోబమ్ మరక్ కు చెందిన నిందితుడి నుంచి ఎ.32 క్యాలిబర్ లైసెన్స్డ్ తుపాకిని స్వాధీనం చేసుకున్నారు. రెండు మ్యాగజైన్లు, 9 కాట్రిడ్జ్‌లను కూడా సీజ్ చేశారు. కాగా.. బీజేపీ నేత హత్య వెనుక ఉన్న మనుషులు, కారణాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
Next Story