Fri Dec 27 2024 19:06:41 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ బీజేపీ నేత వీడియో వైరల్.. ఎలాంటి చర్యలు ఉంటాయో?
రేపు నాతో వస్తావా
ఏపీలో మరో పొలిటికల్ లీడర్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. బీజేపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడికి, ఓ మహిళకు మధ్య జరిగిన వీడియో కాల్ వైరల్ అయింది. పార్టీకి చెందిన మహిళతోనే ఆయన వీడియోకాల్లో మాట్లాడుతూ కనిపించారని అంటున్నారు. అందులో ఆయన నగ్నంగా కనిపించారు. కాల్ సమయంలో సదరు బీజేపీ నేత "రేపు నాతో వస్తావా?" అని అడగడం వినవచ్చు. "గత సారి లాగానే రేపు కూడా తాగుదాం..." అని చెప్పడం కూడా వీడియోలో ఉంది. అయితే ఈ వీడియోపై అంతర్గత విచారణ జరుపుతున్నామని, వాస్తవాలను పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఏపీ రాజకీయాల్లో గత కొద్ది నెలలుగా పలువురు నేతలకు సంబంధించినవిగా పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. కొన్ని పార్టీలు ఆయా నేతలపై చర్యలు తీసుకోగా, మరికొన్ని పార్టీలు సైలెంట్ గా ఉన్నాయి. ఆరోపణలు వచ్చిన నేతలు ఏకంగా సెటిల్మెంట్లు కూడా చేసుకోవడంతో బాధితులు సైలెంట్ కూడా అయ్యారు.
Next Story