Mon Dec 23 2024 11:18:51 GMT+0000 (Coordinated Universal Time)
ఆ కారు నాది కాదు.. ఎమ్మెల్యే స్పష్టీకరణ
ఆ కారు ప్రమాదంతో తనకు సంబంధం లేదని బోధన ఎమ్మెల్యే షకీల్ చెప్పారు. తాను ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నానని చెప్పారు.
ఆ కారు ప్రమాదంతో తనకు సంబంధం లేదని బోధన ఎమ్మెల్యే షకీల్ చెప్పారు. తాను ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నానని చెప్పారు. తాను తన స్నేహితుడు మీర్జాకు ఎమ్మెల్యే స్టిక్కర్ ఇచ్చానని చెప్పారు. ఆ వాహనం ఒక ప్రయివేటు సంస్థ పేరు మీద ఉందన్నారు. ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్నంత మాత్రాన ఆ ప్రమాదానికి, తనకు ఏమాత్రం సంబంధం లేదని షకీల్ వివరించారు. తాను ఈ విషయాన్ని పోలీసులకు కూడా తెలిపానని చెప్పారు.
బాలుడి మృతికి....
జూబ్లీహిల్స్ లో ఒక కారు బీభత్సం సృష్టించి రెండేళ్ల బాలుడు మృతికి కారణమయింది. ఆ కారుపై ఎమ్మెల్యే స్టికర్ ఉండటంతో పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే కారును అక్కడే వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు. డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Next Story