Mon Dec 23 2024 11:03:44 GMT+0000 (Coordinated Universal Time)
ఆస్ట్రేలియాలో డబ్బాలో దొరికిన తెలుగు మహిళ మృతదేహం
ఆస్ట్రేలియాలో ఓ డబ్బాలో మహిళ మృతదేహం లభించింది
ఆస్ట్రేలియాలో ఓ డబ్బాలో మహిళ మృతదేహం లభించింది. ఆస్ట్రేలియాలోని విక్టోరియాలోని బక్లీలో రోడ్డు పక్కన ఓ డబ్బా కనిపించగా.. అందులో ఓ మహిళ మృతదేహం కనిపించింది. శ్వేత మాధగాని అనే హైదరాబాదీ మహిళ మృతదేహమని ధృవీకరించారు.
హైదరాబాద్లోని ఏఎస్ రావు నగర్కు చెందిన శ్వేతా మాధగాని అనే వివాహిత మృతదేహం ఆస్ట్రేలియాలోని విక్టోరియాలోని జిలాంగ్కు పశ్చిమాన ఉన్న బక్లీ వద్ద ఒక రహదారిపై డబ్బాలో కనిపించింది. మృతురాలు తన భర్త అశోక్ రాజ్, మూడేళ్ల కొడుకుతో కలిసి ఉంటోంది. మహిళను హత్య చేసి నిందితుడు విదేశాలకి పారిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆస్ట్రేలియా మిర్కావే, పాయింట్ కుక్లోని చిరునామాలో హత్యకు గురయిన మహిళ నివాసం ఉండేదని వెల్లడించారు. కాగా మృతురాలు శ్వేత భర్త అశోక్ రాజ్ వరికుప్పల ఇటీవలే తన కుమారుడితో కలిసి ఇండియాకి తిరిగొచ్చారు. అంతలోనే ఈ విషాద ఘటన జరిగింది. కేసు నమోదు చేసిన విక్టోరియా పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. పక్కా సమాచారం ప్రకారమే హత్య జరిగిందని పోలీసులు నిర్ధారించారు.
Next Story