Mon Dec 23 2024 03:12:08 GMT+0000 (Coordinated Universal Time)
నడిరోడ్డుపై శిశువు మృతదేహం
ఏలూరు ఆసుపత్రి ఎమెర్జెన్సీ వార్డు ఎదుట శిశువు మృతదేహం కనపడటంతో సిబ్బందితో పాటు రోగి బంధువులు కూడా షాక్కు గురయ్యారు.
ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కలకలం రేగింది. ఏలూరు ఆసుపత్రి ఎమెర్జెన్సీ వార్డు ఎదుట శిశువు మృతదేహం కనపడటంతో సిబ్బందితో పాటు రోగులు, రోగి బంధువులు కూడా షాక్కు గురయ్యారు. రోడ్డుపై అప్పుుడే పుట్టిన నవజాతి శిశువు మృతదేహంగా గుర్తించారు. అయితే కాసేపు ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోక పోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనంగా చెప్పాలి.
ఆసుపత్రి ఎదుటే...
అయితే ఉదయాన్నే ఆసుపత్రిలోని రోగుల బంధువులు చూసి సిబ్బందికి చెప్పినా పట్టించుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. డెలివరీ కోసం వచ్చి బిడ్డ చనిపోవడంతో అక్కడే వదలి పోయారని కొందరు అంటుండగా, ఆసుపత్రిలో చనిపోయిన బిడ్డను అక్కడ వదిలేశారా? అన్న అనుమానం కలుగుతుంది. రోడ్డుపై నవజాతి శిశువు మృతదేహం కలకలం రేపడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story