Mon Dec 23 2024 15:10:26 GMT+0000 (Coordinated Universal Time)
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి, 8 మందికి గాయాలు
మృతదేహాలు, క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు..
కర్నూల్ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. 8 మందికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే..కర్నూల్ జిల్లా కోడుమూరు సమీపంలో బొలెరో వాహనాన్ని ఐచర్ ఢీ కొట్టింది. ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా.. మరో 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
మృతదేహాలు, క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులు హోళగుంద మండలలం హెబ్బటంకు చెందిన మల్లయ్య, కురుకుంద కు చెందిన వీరయ్య, కొత్తపేటకు చెందిన ముత్తయ్యగా గుర్తించారు. వీరంతా అడవిపందుల వేటకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో బొలెరో వాహనం నుజ్జునుజ్జయింది.
Next Story