ఈడీ విచారణకు హాజరైన ఐశ్వర్యరాయ్
ఐశ్వర్యరాయ్ ఢిల్లీలోని జామ్ నగర్ హౌస్ లోని ఈడీ కార్యాలయంలో హాజరయ్యారు. విదేశీ మారకద్రవ్య నిబంధనల
పనామా పేపర్స్ లీక్స్ కేసులో బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ కు సోమవారం ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. సమన్లు ఇచ్చిన రోజే విచారణకు హాజరు కావాలని అధికారులు పేర్కొనగా.. ఐశ్వర్యరాయ్ ఢిల్లీలోని జామ్ నగర్ హౌస్ లోని ఈడీ కార్యాలయంలో హాజరయ్యారు. విదేశీ మారకద్రవ్య నిబంధనల ఉల్లంఘన కింద ఐశ్వర్యను అధికారులు ప్రశ్నిస్తున్నారు. పన్ను ఎగ్గొట్టి విదేశాలకు అక్రమంగా నగదు తరలించారన్న ఆరోపణలపై ప్రశ్నించేందుకు గాను ఈడీ ఐశ్వర్యకు నోటీసులిచ్చింది.
పన్ను ఎగవేసి విదేశాలకు నగదు తరలింపు
కాగా.. ఐశ్వర్యరాయ్ కు గతంలోనే ఈడీ సమన్లు జారీ చేయగా.. విచారణకు హాజరయ్యేందుకు కొంత సమయం కోరింది. ఇప్పుడు సమన్లు ఇవ్వగా.. హాజరయ్యేందుకు వీలుకాదని తెలిపింది. కానీ ఈడీ ఖచ్చితంగా హాజరుకావాల్సిందేనని చెప్పడంతో ఐశ్వర్యరాయ్ విచారణకు హాజరయ్యారు. ఆర్బీఐ నిబంధనల మేరకు 2004 నుంచి విదేశాలకు పంపిన ధనం వివరాలను తెలుపాలని గత నోటీసుల్లోనే ఈడీ పేర్కొంది. ప్రపంచంలోని అత్యంత ధనికులు, శక్తిమంతమైన వ్యక్తులు పన్నులు ఎగ్గొట్టడానికి షెల్ కంపెనీల ద్వారా విదేశాలకు నిధులు తరలించారని.. 2016లో లీకైన పనామా పత్రాల్లో వెల్లడైంది. అయితే లీకైన పనామా పత్రాల్లో ఐశ్వర్యరాయ్, అభిషేక్ సహా భారత్కు చెందిన ప్రముఖుల పేర్లు ఉండటం గమనార్హం. నెలరోజుల క్రితం అభిషేక్ కు కూడా నోటీసులివ్వగా.. ఈడీ విచారణకు హాజరై, కొన్నిడాక్యుమెంట్లను కూడా అధికారులకు ఇచ్చినట్లు తెలిసింది.