Fri Nov 22 2024 20:13:15 GMT+0000 (Coordinated Universal Time)
కన్న తండ్రిని అతి కిరాతకంగా చంపిన కొడుకు.. శవాన్ని ఏమి చేశాడంటే..!
నా సుదీర్ఘ కెరీర్లో ఇది అత్యంత భయంకరమైన సంఘటన. కొడుకు తన తండ్రిని చంపడానికి కారణం
పాకిస్తాన్లో దారుణం చోటు చేసుకుంది. కరాచీ నగరంలో ఓ వ్యక్తి తండ్రిని అతి కిరాతకంగా చంపేశాడు. ఆ తర్వాత శవాన్ని దాచేయడానికి చాలానే ప్రయత్నాలు చేశాడు. తన 52 ఏళ్ల తండ్రిని దారుణంగా హత్య చేసి, అతని మృతదేహాన్ని ముక్కలుగా నరికి, వేర్వేరు ప్రదేశాల్లో విసిరేశాడు. అంతేకాకుండా కొన్ని శరీర భాగాలకు నిప్పంటించాడు కూడా..! ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఎంతో కష్టపడితే కానీ తండ్రి మృతదేహాన్ని గుర్తించలేకపోయారు. కొన్ని క్లూల ఆధారంగా కుమారుడిని పోలీసులు అరెస్టు చేసినట్లు ఎస్ఎస్పి (పరిశోధనలు) అల్తాఫ్ హుస్సేన్ తెలిపారు.
ఏప్రిల్ 21న, ఆఫ్ఘన్ బస్తీకి సమీపంలో సూపర్ హైవేపై తల, కాళ్లు లేకుండా ముక్కలుగా చేసి కాలిపోయిన మృతదేహం ఒక సంచిలో కనుగొనబడింది. దీన్ని చూసి పోలీసులు కూడా షాకయ్యారు. ఎవరిదీ.. ఎక్కడి నుండి వచ్చింది.. ఎవరు పడేశారు అనే విషయాన్ని తెలుసుకోడానికి చాలా కష్టపడ్డారట పోలీసులు.
"నా సుదీర్ఘ కెరీర్లో ఇది అత్యంత భయంకరమైన సంఘటన. కొడుకు తన తండ్రిని చంపడానికి కారణం అతను అతనిని కొట్టడం మరియు దుర్భాషలాడడం" అని హుస్సేన్ చెప్పుకొచ్చాడు. తన తండ్రి ఎప్పుడు చూసినా కొడుతూ ఉండేవాడని.. ఇష్టమొచ్చినట్లు తిట్టేవాడని.. ఇక ఒకరోజు కోపంతో తండ్రిని ఆ కొడుకు చంపేశాడు. చేసిన మర్డర్ ను దాచడానికి కొడుకు చాలానే ప్లాన్లు వేశాడు కానీ.. చివరికి దొరికిపోయాడు. హత్యకు గురైన వ్యక్తి పీఐబీ కాలనీకి చెందిన సలీమ్ ఖిల్జీగా పోలీసులు గుర్తించారు."మేము శరీర భాగాలను గుర్తించాము. కొడుకును ఇతర బంధువులను విచారించిన తర్వాత, కొడుకు ప్రవర్తన చాలా వింతగా ఉందని గుర్తించాం. అతడిని విచారణ చేయగా తన నేరాన్ని అంగీకరించాడు" అని హుస్సేన్ చెప్పారు.
నిందితుడు ఏప్రిల్ 21న తన తండ్రి తలపై సుత్తితో కొట్టి చంపాడు. అతను మృతదేహాన్ని నరికి ముక్కలుగా చేసి వాటిని కాల్చివేసాడు.. ఆ తర్వాత ఆ శరీర భాగాలను వేర్వేరు ప్రాంతాల్లో పారేశాడు. పోలీసులు మూడు వేర్వేరు ప్రదేశాలలో శరీర భాగాలను కనుగొన్నారు. హత్య చేసిన వ్యక్తిని గుర్తించడానికి ఫోరెన్సిక్ బృందం చాలానే కష్టపడ్డారట. తన తండ్రి తలను లియారీ నదిలోకి విసిరివేసి, జూబ్లీ మార్కెట్ ప్రాంతంలో కాళ్లు విసిరేశాడు. మొండెంలోని మిగిలిన భాగాన్ని గోనెలో చుట్టి, అల్-ఆసిఫ్ స్క్వేర్కు సమీపంలో ఉన్న ఆఫ్ఘన్ కట్ సూపర్ హైవే దగ్గర విసిరేసినట్లు పోలీసులు తెలిపారు.
Next Story