Mon Dec 23 2024 16:53:44 GMT+0000 (Coordinated Universal Time)
స్విమ్మింగ్ పూల్ లో పడి బాలుడు మృతి
స్విమ్మింగ్ పూల్ నిర్వాహకులు బాలుడిని ట్యూబ్ లేకుండా అనుమతించడంతో ఈ విషాద ఘటన జరిగినట్లు..
నాగోల్ : స్విమ్మింగ్ పూల్ లో పడి బాలుడు మృతి చెందిన ఘటన మేడ్చల్ జిల్లా నాగోల్ లో జరిగింది. బ్లూ ఫ్యాగ్ స్విమ్మింగ్ పూల్ లో పడి బాలుడు మరణించాడు. స్విమ్మింగ్ పూల్ నిర్వాహకులు బాలుడిని ట్యూబ్ లేకుండా అనుమతించడంతో ఈ విషాద ఘటన జరిగినట్లు సమాచారం. స్విమ్మింగ్ పూల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తమ కొడుకు మృతి చెందాడని తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story