Mon Dec 23 2024 00:36:19 GMT+0000 (Coordinated Universal Time)
అతనికి 23, ఆమెకు 50.. ప్రేయసి ఇంట్లో ప్రియుడు మృతి
ఒకేచోట పనిచేస్తున్న వారిద్దరి మధ్య పరిచయం పెరిగింది. రామకుమారి తన చెల్లెలి కూతురితో పెళ్లి చేయిస్తానని..
అతనికి 23. ఆమెకు 50. వయసు గురించి ఆలోచించకుండా ఇద్దరూ సహజీవనం చేశారు. మద్యానికి బానిసైన ప్రియుడు ప్రేయసి ఇంట్లో అనుమానాస్పదంగా మృతి చెందడంతో.. మృతుడి బంధువులు ఆమెపై కేసు పెట్టారు. అనంతపురం జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లా యాదమర్రి మండలం కాసిరాళ్ల గ్రామానికి చెందిన వేణుమూర్తి కుమారుడు సురేష్(23) పలమనేరులోని కోళ్ల ఫారంలో పని చేసేవాడు. అదే కోళ్ల ఫారంలో అనంతపురం జిల్లా గోరంట్ల మండలం చింతలపల్లికి చెందిన రామకుమారి (50) కూడా పనిచేసేది. ఆమెకు భర్తలేడు.
ఒకేచోట పనిచేస్తున్న వారిద్దరి మధ్య పరిచయం పెరిగింది. రామకుమారి తన చెల్లెలి కూతురితో పెళ్లి చేయిస్తానని నమ్మించి తనతో చింతలపల్లికి తీసుకొచ్చింది. ఇద్దరూ ఒకేఇంట్లో ఉంటూ సహజీవనం చేయసాగారు. ఈక్రమంలో సురేష్ మద్యానికి బానిసయ్యాడు. కొన్నాళ్లు వ్యవసాయ కూలీగా కూడా పనిచేశాడు. చింతలపల్లిలో ఉన్న సురేష్ ను తీసుకెళ్లేందుకు వారి కుటుంబ సభ్యులు వచ్చారు. తమతో ఇంటికి రావాలని కోరగా.. రానని చెప్పేశాడు. కత్తితో ఆత్మహత్యాయత్నం చేసుకోబోతే.. చేసేదేమీ లేక తిరిగి వెళ్లిపోయారు.
కాగా.. సురేష్ కు ఇటీవల పచ్చకామెర్ల వ్యాధి వచ్చింది. అందుకు సరైన మందులు వాడలేదో ఏమోగానీ.. శనివారం రాత్రి నిద్రపోయిన సురేష్ ఆదివారం ఉదయం లేవలేదు. సురేష్ మరణించినట్లు రామకుమారి గుర్తించింది. విషయం తెలుసుకున్న సురేష్ కుటుంబ సభ్యులు గ్రామానికి వచ్చారు. రామకుమారి నిర్లక్ష్యం వల్లే అతను చనిపోయాడని పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story