Mon Dec 23 2024 07:23:29 GMT+0000 (Coordinated Universal Time)
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో బాలుడి కిడ్నాప్
రైల్వే స్టేషన్లో తల్లి పక్కనే ఉండి ఆడుకుంటోన్న ఏడాది బాలుడి వద్దకు ఓ యువతి వచ్చింది.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఓ యువతి బాలుడిని కిడ్నాప్ చేసిన ఘటన కలకలం రేపింది. రైల్వే స్టేషన్లో తల్లి పక్కనే ఉండి ఆడుకుంటోన్న ఏడాది బాలుడి వద్దకు ఓ యువతి వచ్చింది. ఆ బాలుడికి ఏవేవో మాటలు చెప్పి స్టేషన్ బయటికి తీసుకెళ్లినట్లు సీసీటీవీ లో రికార్డైంది. అనంతరం ఓ ఆటోలోకి బాలుడిని ఎక్కించి తీసుకెళ్లింది. పక్కనే కూర్చున్న బాలుడు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రైల్వే స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించారు. బాలుడు కిడ్నాప్ అయినట్లు గుర్తించారు. బాలుడి ఆచూకిని గుర్తించేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. యువతి వెళ్లిన ఆటో ఏ ప్రాంతం వైపు వెళ్లిందో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఆమె ఎవరు ? బాలుడిని ఎందుకు కిడ్నాప్ చేసింది ? ఎక్కడికి తీసుకెళ్లింది ? అన్న విషయాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది.
Next Story