Tue Nov 05 2024 07:49:00 GMT+0000 (Coordinated Universal Time)
ఫోన్ లో పోర్న్ చూసిన పిల్లాడు.. ఎంతటి ఘోరం చేశాడంటే?
ఓ బాలిక మరణానికి సంబంధించి విచారణ జరుపుతున్న మధ్యప్రదేశ్
ఓ బాలిక మరణానికి సంబంధించి విచారణ జరుపుతున్న మధ్యప్రదేశ్ పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిసి నిర్ఘాంతపోయారు. మధ్యప్రదేశ్లోని రేవాలో 9 ఏళ్ల బాలిక చనిపోయింది. అయితే ఆమెను సొంత సోదరుడే అత్యాచారం చేసి చంపేశాడని తెలిసి పోలీసులు షాక్ అయ్యారు. 9 ఏళ్ల బాలికపై 13 ఏళ్ల బాలుడు అత్యాచారం చేసి చంపేశాడు. విషయం తెలుసుకున్న బాలుడి తల్లి, ఇద్దరు అక్కలు చనిపోయిన బాలిక మృతదేహాన్ని ఇంటిబయట పడేశారు.
ఏప్రిల్ 24న అత్యాచారం జరిగింది. టీనేజ్ బాలుడు మొబైల్లో అశ్లీల వీడియోను చూసి బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. సాంకేతిక ఆధారాల ఆధారంగా బాధితురాలి 13 ఏళ్ల సోదరుడు, అతడి తల్లి, 17, 18 సంవత్సరాల వయస్సు ఉన్న అక్కలను అదుపులోకి తీసుకున్నారు. పోలీసు సూపరింటెండెంట్ వివేక్ సింగ్ మాట్లాడుతూ.. ఏప్రిల్ 24 న జావా పోలీస్ స్టేషన్ పరిధిలో తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. ఆమెను గొంతు నులిమి చంపేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలిక నిద్రిస్తున్న ఇంటి ప్రాంగణంలో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఘటన జరిగిన రోజున బాధితురాలి 13 ఏళ్ల సోదరుడు ఆమె పక్కనే పడుకున్నట్లు విచారణలో వెలుగులోకి వచ్చింది. యువకుడు మొబైల్ ఫోన్లో అసభ్యకర వీడియోలు చూసి సోదరిపై అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని తండ్రికి చెబుతానని బాధితురాలు బెదిరించడంతో ఆ బాలుడు ఆమెను గొంతునులిమాడు. తర్వాత తన తల్లిని నిద్రలేపి విషయం చెప్పాడు. ఆ తర్వాత తల్లి బాలిక బతికే ఉన్నట్లు గుర్తించింది. అది చూసి నిందితులు మళ్లీ బాలిక గొంతు నులిమి చంపేశారు. ఈలోగా, అతని ఇద్దరు అక్కలు కూడా మేల్కొన్నారు.. అయినా పోలీసులకు సమాచారం ఇవ్వలేదు.
ఇక దర్యాప్తును తప్పుదారి పట్టించడానికి పోలీసులకు సమాచారం ఇవ్వడానికి ముందు వారందరూ బాలిక మంచం ఉన్న స్థలాన్ని మార్చారు. ఏదో పురుగు కుట్టడం వలన చనిపోయిందని కుటుంబ సభ్యులకు, పోలీసులకు తెలిపారు. పోలీసులకు అనుమానం వచ్చి విచారణ చేశారు.. పోస్ట్మార్టం నివేదికలో అత్యాచారం, హత్యకు సంబంధించిన ఆధారాలు లభించాయి. దర్యాప్తు కోసం సిట్ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇంట్లోకి ఎవరూ ప్రవేశించిన ఆనవాళ్లు లేవని విచారణలో తేలింది. సాంకేతిక ఆధారాలు సేకరించి, 50 మందిని విచారించిన తర్వాత.. పోలీసులు కుటుంబ సభ్యుల వాంగ్మూలాలలో తేడాలను కనుగొన్నారు. అనుమానం రావడంతో తీవ్రంగా విచారించారు.. ఆ తర్వాత వారు నేరాన్ని అంగీకరించారని పోలీసులు చెప్పారు.
Next Story