Mon Dec 23 2024 07:04:36 GMT+0000 (Coordinated Universal Time)
నగరం నడిబొడ్డున.. యువతిపై ప్రేమోన్మాది దాడి
తాజాగా ఓ ప్రేమోన్మాది తనను పెళ్లి చేసుకోకపోతే చంపేస్తానంటూ.. యువతి గొంతుకోశాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని..
ప్రేమిస్తున్నానంటూ వెంటపడటం.. ప్రేమను ఒప్పుకోకపోతే చంపేస్తానని బెదిరించడం, తనను కాదని ఇంకొకరిని పెళ్లాడితే అన్నంత పనీ చేయడం.. ప్రస్తుతం సమాజంలో తరచుగా ఇలాంటి ఘటనలే చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఓ ప్రేమోన్మాది తనను పెళ్లి చేసుకోకపోతే చంపేస్తానంటూ.. యువతి గొంతుకోశాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని నార్సింగిలో వెలుగుచూసింది. మాట్లాడాలని పిలిచి.. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. ఇద్దరి మధ్య మాట మాట పెరగడంతో.. అది కాస్తా గొడవకు దారితీసింది. ఈ క్రమంలో యువకుడు తనవెంట తెచ్చుకున్న కత్తితో యువతిపై దాడి చేశాడు.
నార్సింగి టీ గ్రీల్ హోటల్ వద్దకు యువతిని పిలిచిన గణేశ్.. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. అందుకు ఆమె నిరాకరించడంతో కోపంతో రగిలిపోయాడు. బ్యాగ్ లో ఉన్న కత్తితో బెదిరించాడు. యువతిపై కత్తితో దాడి చేయడంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే గణేషే ఆమెను స్థానికులతో కలిసి ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు గణేష్ ను అదుపులోకి తీసుకున్నారు. యువతిని వాసవిగా గుర్తించారు. గణేష్, వాసవి లు ఏపీలోని పిడుగురాళ్లకు చెందినవారిగా గుర్తించారు. అయితే.. ఇద్దరూ ప్రేమించుకుంటే పెద్దలు నిరాకరించడంతో ఇలా చేశాడా ? లేక వాసవిని వేధించాడా ? అన్న విషయాలు తెలియాల్సి ఉంది.
Next Story