Sun Dec 22 2024 08:00:24 GMT+0000 (Coordinated Universal Time)
విషాదం.. గుండెపోటుతో పెళ్లికొడుకు మృతి
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లో జరిగిందీ ఘటన. రావుల శంకరయ్యచారి, భూలక్ష్మి దంపతుల కుమారుడు రావుల సత్యనారాయణాచారి(34)కు
మరికొద్దిగంటల్లో పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట.. చావు డప్పులు మోగాయి. చిరునవ్వులతో పెళ్లిపీటలెక్కాల్సిన పెళ్లికొడుకు.. పాడెక్కాడు. పెళ్లికి కొద్దిగంటల ముందు అతను గుండెపోటుతో మరణించడంతో.. పెళ్లింట విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లో జరిగిందీ ఘటన. రావుల శంకరయ్యచారి, భూలక్ష్మి దంపతుల కుమారుడు రావుల సత్యనారాయణాచారి(34)కు జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన యువతితో శుక్రవారం వివాహం నిర్ణయించారు. పెళ్లి ఏర్పాట్లలో ఉన్న సత్యనారాయణాచారి గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
కుటుంబ సభ్యులు సత్యనారాయణను గమనించి.. వెంటనే ఉట్నూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పగా.. అక్కడి నుండి ఆదిలాబాద్ రిమ్స్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం సత్యనారాయణచారి మృతి చెందాడని బంధువులు తెలిపారు. పెళ్లితో కొత్తజీవితంలో అడుగుపెట్టాల్సిన పెళ్లికొడుకు హఠాన్మరణంతో ఆ ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి.
Next Story