Mon Dec 23 2024 11:07:50 GMT+0000 (Coordinated Universal Time)
బీహార్ లో పరువుహత్య.. చెల్లెలి ప్రియుడిని నరికి కుక్కలకు ఆహారంగా..
రెండ్రోజుల తర్వాత బిట్టు పై మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. 18న కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న..
బీహార్ లో ఓ యువకుడి పరువు హత్య కలకలం రేపింది. తన చెల్లెల్ని ప్రేమించిన యువకుడిని ముక్కలు ముక్కలుగా నరికి చంపాడో ఓ వ్యక్తి. అంతటితో ఆగకుండా మృతుడి శరీర భాగాలను కుక్కలకు ఆహారంగా వేశాడు. ఈ ఘటన నలంద జిల్లాలో జరగ్గా.. ఆ రాష్ట్రమంతా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. బిట్టు కుమార్ అనే యువకుడు ఈ నెల 16న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు గాలించినా ఎక్కడా ఆచూకి తెలియరాలేదు. రెండ్రోజుల తర్వాత బిట్టు పై మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. 18న కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
బిట్టు మిస్సింగ్ పై దర్యాప్తు చేస్తున్న పోలీసులకు.. అతడి సన్నిహితులు చెప్పిన దానిప్రకారం రాహుల్ అనే యువకుడిపై అనుమానం కలిగింది. అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా.. అసలు విషయం చెప్పాడు. రాహుల్ చెప్పింది విని పోలీసులు నిర్ఘాంతపోయారు. బిట్టు తన చెల్లెలితో సన్నిహితంగా ఉండటాన్ని చూసి తట్టుకోలేక హతమార్చినట్లు అంగీకరించాడు. ఆ తర్వాత బిట్టు శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి కుక్కలకు ఆహారంగా వేశానని, మిగిలిన శరీర భాగాల్ని నదిలో పడేసినట్లు చెప్పాడు. రాహుల్ చెప్పిన సమాచారం మేరకు నదిలో బిట్టు శరీర భాగాల కోసం పోలీసులు గాలిస్తున్నారు. రాహుల్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
Next Story