Tue Dec 24 2024 01:10:50 GMT+0000 (Coordinated Universal Time)
అన్నను కొట్టి చంపిన తమ్ముడు.. వివాహేతర సంబంధమే కారణమా ?
ఇంటికెళ్లిన బబ్లూ.. తన సోదరుడితో వివాహేతర సంబంధం గురించి భార్యను ప్రశ్నించాడు. ఇద్దరి మధ్య మాటలయుద్ధం జరుగుతుండగా..
తన భార్యతో అన్నకు వివాహేతర సంబంధం ఉందని అనుమానించిన సోదరుడు.. అన్నను కొట్టి చంపాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ పరిధిలోని ముకింపూర్ గ్రామంలో ఆదివారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బబ్లూ కుమార్, అర్జున్ కుమార్ అన్నదమ్ములు. బబ్లూ కుమార్ కూలీ పనులు చేస్తూ.. కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతనికి భార్య, ఏడాది వయసున్న కొడుకు ఉన్నారు. కాగా.. ఆదివారం రాత్రి అన్నదమ్ములిద్దరూ కలిసి మద్యం సేవించారు.
ఇంటికెళ్లిన బబ్లూ.. తన సోదరుడితో వివాహేతర సంబంధం గురించి భార్యను ప్రశ్నించాడు. ఇద్దరి మధ్య మాటలయుద్ధం జరుగుతుండగా.. అక్కడికి వెళ్లిన అర్జున్ కూడా ఈ విషయంపై బబ్లూతో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి.. గొడవ పెద్దదైంది. ఒకరినొకరు కొట్టుకుంటూ ఇంట్లో ఉన్న కిచెన్ లోకి వెళ్లారు. ఈ క్రమంలో అక్కడున్న ఫ్రయింగ్ పాన్తో అన్న బబ్లూ కుమార్ తలపై గట్టిగా కొట్టాడు అర్జున్ కుమార్. బబ్లూ స్పృహతప్పిపడిపోయే వరకు బాదుతూనే ఉన్నాడు. దీంతో బబ్లూ అక్కడే కూలిపోయాడు. వెంటనే అర్జున్ కుమార్ అక్కడ్నుంచి పారిపోయాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా ప్రాంతానికి వెళ్లి.. బబ్లూని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బబ్లూ మరణించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అర్జున్ కుమార్ను అరెస్టు చేశారు.
Next Story