Sun Dec 22 2024 18:27:10 GMT+0000 (Coordinated Universal Time)
సినీ నటుడు రఘుబాబు కారు ఢీకొని బీఆర్ఎస్ నేత మృతి
సినీ నటుడు రఘుబాబు కారు ఢీకొని బీఆర్ఎస్ నాయకుడు మృతి చెందాడు
సినీ నటుడు రఘుబాబు కారు ఢీకొని బీఆర్ఎస్ నాయకుడు మృతి చెందాడు.నల్లగొండ బైపాస్ రోడ్డులో సినీ నటుడు రఘుబాబు కారు ద్విచక్ర వాహనంపై వెళుతున్న వ్యక్తిని ఢీకొట్టింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు.ఈ ప్రమాదంలో నల్లగొండ పట్టణ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సందినేని జనార్దన్ రావు మృతి చెందారు
ఈడ్చుకుని వెళ్లి...
బైకును దాదాపు యాభై మీటర్ల దూరం కారు. ఈడ్చి కెళ్ళిందని స్థానికులు చెబుతున్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు రఘుబాాబును అదుపులోకి తీసుకున్నారు. విచారిస్తున్నారు. ప్రమాద సమయంలో రఘుబాబు కారును డ్రైవ్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Next Story