మైలార్దేవుపల్లిలో మైనర్ బాలుడి దారుణ హత్య
మైలార్దేవుపల్లిలో దారుణ ఘటన జరిగింది. మైనర్ బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా హత్య చేశారు.
మైలార్దేవుపల్లిలో దారుణ ఘటన జరిగింది. మైనర్ బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మైలార్దేవుపల్లిలోని లక్ష్మిగూడ హౌసింగ్ బోర్డ్ కాలనీలోని నిర్మానుష్య ప్రాంతంలో మైనర్ బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో గొంతు కోసి అతికిరాతకంగా హత్య చేశారు. బాలుడు మృతదేహాన్ని చూసి భయభ్రాంతులకు గురైన స్థానికులు వెంటనే పోలీసుల కు సమాచారాన్ని అందించారు. హుటాహుటిన పోలీసులు, క్లూస్ టీం ఘటనా స్థలానికి చేరుకున్నారు.
మృతుడు బీహార్ కు చెందిన రాజా పాశ్వాన్(17) గా పోలీసులు గుర్తించారు. రాజా పాశ్వాన్ 3 నెలల క్రితమే నగరానికి వలస వచ్చినట్లు తెలిపారు. పాత గొడవలే హత్యకు కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.